రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి :  దాసోజు శ్రవణ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పోలీసు బలగాలను ఉద్దేశించి నేరపూరిత క్రిమినల్‌ బెదిరింపులకు పాల్పడిన రేవంత్‌ రెడ్డిని సుమోటో పద్ధతి ద్వారా తక్షణమే చట్టం పరంగా శిక్షించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కోరారు. ఈ మేరకు డీజీపీకి మంగళవారం ట్వీట్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి ఒక మానసిక రోగిగా మారారని విమర్శించారు.