అనుచిత వ్యాఖ్యలు చేసిన జవాన్ పై చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న డ్రైవర్లను బూతు మాటలు తిడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన జవాన్ పై చర్య తీసుకోవాలని గత వారం రోజులుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందించకపోవడంతో శుక్రవారం డ్రైవర్లు డిఆర్సిలో వాహనాలను నిలిపివేసి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మల్లెల గోవర్ధన్ మాట్లాడుతూ.. మున్సిపల్ జవాన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఇన్చార్జ్ చిత్రా మిశ్రా స్పందించి రాతపూర్వక హామీ ఇవ్వడంతో డ్రైవర్లు ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు భూపతి, కార్యదర్శి ఎక్ నాథ్, కోశాధికారి లక్ష్మణ్, సీఐటీయూ నాయకులు చంద్ర సింహ,మారుతి,తదితరులు పాల్గొన్నారు.