కార్యకర్తలే నా బలం.. ప్రజలే నా దేవుళ్ళు

– ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
కార్యకర్తలే నా బలమని, ప్రజలే నా దేవుళ్లని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని సుమారు15 వార్డులకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు, నాయకులతో ఆత్మీయ సమ్మెళనం నిర్వహించారు. స్థానిక రామ టాకీస్‌ ఏరియాలో జరిగిన బిఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం మన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలే బీఆర్‌ఎస్‌ గెలుపుకు దోహదం చేస్తాయన్నారు. ఎవరిని కుట్రలు, కుతంత్రాలు చేసిన, వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుండి పోటీ చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ పార్టీ, కొత్తగూడెంలో వనమా గెలుపు ఆపే శక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో రూ.3వేల కోట్లుతో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కాపు సీతా లక్ష్మి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దామోదర్‌ యాదవ్‌, నాయకులు బీఆర్‌ఎస్‌ నాయకులు రజాక్‌, కాసుల వెంకట్‌, కౌన్సిలర్లు కోలాపూరి ధర్మరాజు, అఫ్జల్‌ ఉన్నీసా బేగం, అంబుల వేణు, పల్లపు లక్ష్మణ్‌, కో-ఆప్షన్‌ సభ్యులు కనుకుంట్ల పార్వతి, దుంపల అనురాధ, నాయకులు కెకె. శ్రీను, కొండా స్వామీ తదితరులు పాల్గొన్నారు.