ఉద్యమకారులే బలం

నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమకారులే బలమని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట లోని అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ యెండల ప్రదీప్  నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి నాటి ఉద్యమ గుర్తులను గుర్తు చేసుకున్నారు. కేసిఆర్ అనే ఫ్యామిలీకి తెలంగాణ లోని ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులవలె సహకరించిన వారిని కలవడం ఒక బాధ్యతగానే బావిస్తున్నామని ఆమె తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకునే రోజు జూన్ నెలను పండుగల జరువుకుందామని ఆమె తెలిపారు.జూన్ నెల వర్షాలతో మొదలవుతుందని, పండుగలన్ని జూన్ నెల నుండి ప్రారంభం కావడం, జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం అన్ని శుభమని అన్నారు. యెండల కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.