జేపీఎస్ ల పనితీరును పరిశీలించిన అదనపు కలెక్టర్..

నవతెలంగాణ-పెద్దవంగర: మండలంలో పని చేస్తున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ పీరియడ్‌ పూర్తి కావడంతో జేపీఎస్ ల క్రమబద్ధీకరించేందుకు క్షేత్రస్థాయిలో వారి పనితీరును ఆదివారం మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్ పరిశీలించారు. మండల పరిధిలోని 13 గ్రామాల్లో జేసీ పర్యటించి, గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న రికార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, సెగ్రిగేషన్‌ షెడ్‌ తదితర వాటిని పరిశీలించి, కార్యదర్శుల పనితీరును అంచనా వేశారు. కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించేందుకు నిర్దేశిత ఫార్మాట్లో మార్కులు వేసి, ప్రభుత్వానికి అధికారులు నివేదికను పంపనున్నారు. జాయింట్ కలెక్టర్ వెంట తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎంపీఓ సత్యనారాయణ, ఆర్ఐ భూక్యా లష్కర్, ఆయా గ్రామాల సర్పంచులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.