
నవతెలంగాణ – జుక్కల్
కోరం లేక పోవడంతో జుక్కల్ మండల సాదారణ సర్వసభ్య సమావేశం గురువారం నాటి కార్యక్రమం వాయిదా వేయడం జర్గిందని ఎంపిడివో నరేష్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. గురువారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి యశోదా నీలుపటేల్ అద్యక్షతన నిర్వహించ తలపెట్టిన మండల సభ మండలంలోని ఎంపిటిసిలు వివిధ కారాణాలతో రాలేక పోయారు. కోరం సరిపడా సబ్యులు ఎనమిది మంది ఎంపిటిసిలు అవసరం ఉన్నప్పడికి కొంతమంది మాత్రమే వచ్చారు. కావాల్సిన సంఖ్య రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు ఎపిడివో ప్రకటించారు. తదుపరి సమావేశం తెలియచేస్తామని సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలపడం జర్గుతుందని ఆయన పేర్కోన్నారు.