యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గా నియామకమైన భువనగిరి పట్టణానికి చెందిన న్యాయవాది బొమ్మ వెంకటేష్ ని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగారం అంజయ్య ఆధ్వర్యంలో శనివారం వారికి అభినందనలు తెలియజేస్తూ శాలువాతో ఘనంగా సత్కరించారు. తమ నియామకానికి సహకరించిన తోటి న్యాయవాదులు అందరికీ వారు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బల కేశవరెడ్డి గోదా వెంకటేష్ ఐలయ్య నరేష్ ప్రసాద్ లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.