అహ్మదాబాద్ : 2002 గోద్రా అల్లర్లకు సంబంధించి కల్పిత సాక్ష్యాలను సృష్టించారనే కేసు నుంచి తనను తప్పించాలని హక్కుల ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద దాఖలు చేసిన పిటీషన్‌ను అహ్మదాబాద్‌లోని సెషన్స్ కోర్టు గురువారం తిరస్కరించింది. అదనపు సెషన్స్ జడ్జి ఎ ఆర్ పటేల్ ఈ పిటీషన్‌ను తిరస్కరించారు. ఈ పిటీషన్‌కు వ్యతిరేకంగా గుజరాత్ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు బుధవారం తీస్తా సెతల్వాదకు బెయిల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సెతల్వాదతో పాటు ఐపిఎస్ మాజీ అధికారులు ఆర్‌బి శ్రీకుమార్, సంజీవ్ భట్‌లను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు.