రేషన్ షాప్ లలో 14 రకాల వస్తువులను పేదలకు అందించాలని ఐద్వా డిమాండ్  

– ఆర్డిఓ కీ వినతి 

నవతెలంగాణ- కంటేశ్వర్
రేషన్ షాప్ లలో 14 రకాల వస్తువులను పేదలకు అందించాలని ఐద్వానాయకులు ఆర్డిఓకు వినతిపత్రం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా
ఐద్వా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలకు అనుకూలంగా పేద ప్రజలకు రేషన్ షాపులపై 14 రకాల వస్తువులను అందించాలని నిత్యవసర ధరలు రోజురోజుకు పెరగడం వల్ల నిరుపేదలు మూడు పూటలు కనీసం తిండి తినలేని పరిస్థితిలో సతమతమవుతూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది కావున ఈ ప్రభుత్వం ప్రజల సమస్యలు గుర్తుపెట్టుకుని పెట్టుకొని ప్రజల ఆకలి తీరే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐద్వా సంఘం డిమాండ్ ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పు రాకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత. జిల్లా అధ్యక్షురాలు అనిత జిల్లా కమిటీ సభ్యులు రజియా సభ్యులు కళావతి పాల్గొన్నారు.