పుణ్యక్షేత్రంలో నెల రోజుల పాటు అఖండ హరినామ సప్త

– ఆలయ మాజీ చైర్మన్ నరసింహులు గౌడ్ వెల్లడి
నవతెలంగాణ- మద్నూర్
ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దులో గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో అధిక మాసం సందర్భంగా ఈనెల 18 నుండి వచ్చే నెల 16వ తేదీ వరకు ఆలయ ఆవరణంలో అఖండ హరినామ సప్త చేపడుతున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ సోమవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. నెల రోజులు పాటు జరిగే అఖండ హరినామ సప్త కార్యక్రమంలో భజన కీర్తనలతో పాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు అన్న ప్రసాదం నిర్వహించడం. జరుగుతుందని శ్రావణమాసం సందర్భంగా మూడు రాష్ట్రాలకు ప్రత్యేకంగా గుర్తింపుగా ఉన్న పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుందని సప్త కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి ప్రతి రోజు ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్న ప్రసాదం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. శ్రావణమాఆంజనేయ స్వామి సంలో ఆలయ సందర్శనకు వచ్చే సమస్త మూడు రాష్ట్రాల భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు అన్న ప్రసాదానికి నెల రోజులు పాటు జరిగే అన్నదాన కార్యక్రమం భక్తులు ముందుకు వచ్చారని రోజుకు ఒకరి చొప్పున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.