అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ కాళేశ్వరం జోనల్ కమిటీ నియామకం

– అధ్యక్షుడుగా కుమార్ యాదవ్ 
నవతెలంగాణ – మల్హర్ రావు
అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 కాళేశ్వరం జోనల్లో వున్న భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, అసిపాబాద్, కొంరంబిం తదితర ఐదు జిల్లాల యువశక్తి అధ్యక్షుడుగా తాడిచెర్ల గ్రామానికి చెందిన చింతల కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడుగా బండి సుధాకర్ లను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటి జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి ఆదేశాల మేరకు ఈ కమిటీని ప్రకటించినట్లుగా తెలిపారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రములో సవిత్రీబాయి పూలే జయంతి ఉత్సవాల్లో భాగంగా కాళేశ్వరం జోనల్ నుంచి ఉత్తమ మహిళ ఉద్యోగులను పారదర్శకంగా ఎంపిక చేసిన కృషిని గమనించిన తాము ఈ పదవులు అప్పజెప్పడం జరిగిందన్నారు. తమపై నమ్మకంతో ఈ పదవులు అప్పజెప్పిన జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి, రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ బాధ్యతపై అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీకి మంచి పేరు తీసుకవస్తామని కుమార్ యాదవ్, సుధాకర్ అన్నారు.