బోధన్ నియోజకవర్గం ఉత్తమ ఆదర్శ రైతుగా అల్లం రమేష్

నవతెలంగాణ – నవీపేట్: బోధన్ నియోజకవర్గ ఉత్తమ ఆదర్శ రైతుగా రాంపూర్ మాజీ సర్పంచ్ అల్లం రమేష్ ఎంపిక రావడంతో ఎమ్మెల్యే షకీల్ ఆమెన్ శనివారం ప్రశంసా పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం రైతు దినోత్సవం సందర్భంగా అల్లం రమేష్ ను ప్రత్యేకంగా సత్కరించారు. తనకు నియోజకవర్గ ఉత్తమ ఆదర్శ రైతుగా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.