రిటైల్‌ మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయింపు

Allotment of retail liquor shops by lottery– వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం జిల్లా లో రిటైల్‌ మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటా యించినట్టు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపా రు. గురువారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం జి ల్లాలో 2023-2025 సంవత్సరాలకు ఎక్సైజ్‌, గిరిజ న, షెడ్యూల్‌ కులాల, వెనుకబడిన తరగతుల అభివృ ద్ధి శాఖ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్‌ డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయించారు. వైన్‌ షాపులు కేటాయించే మొత్తం ప్రక్రియను వీడియో గ్రఫీ చేశారు. మద్యం షాపులు కేటాయించే సమయం లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు షాపులను కేటాయించినట్టు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని 59 మద్యం దుకాణాలలో ఎస్టీలు 2, ఎస్సీలు 9, గౌడ వర్గాలకు 6 చొప్పున 17 దుకాణాలను ప్రభుత్వ, ఎక్సైజ్‌ కమిషనర్‌ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి కేటాయించగా, 42 మద్యం షాపులు జనరల్‌ కేటగిరి కింద మిగిలినట్టు జిల్లా కలెక్టర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో అద నపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌చంద్ర, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటా జీ, షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, వెనుకబడిన కులాల అభివృద్ధి అధికారి ఉపేందర్‌ లతో పాటు ఎక్సైజ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.