బాధిత కుటుంబానికి పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం

నవతెలంగాణ-యాచారం
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గడల శివలింగం కుటుంబానికి 2002-03 సంవత్సరంలో చదువుకున్న తోటి పూర్వ విద్యార్థులు రూ.లక్షా ఆర్థిక సహాయం ఆదివారం అందజేశారు. తమతో పాటు చదువుకున్న చిన్ననాటి విద్యార్థులు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శివలింగం కుటుంబానికి చిన్ననాటి తోటి విద్యార్థుల మంతా అండగా ఉంటామని భరోసానిచ్చారు. శివలింగం తమతో పాటు క్రమశిక్షణతో మెలిగే వాడని గుర్తు చేశారు. అందరిని ఆప్యాయతతో, ఆత్మాభిమానంతో పలకరించేవాడని వారు కొనియాడారు. బాధిత కుటుంబ సభ్యులు స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.