ఆకంటే అలుసా..?

ఆకంటే అలుసా..?ఎవరినైనా కూరలో కరివేపాకు లెక్క అని తీసేసి మాట్లాడతారు. కానీ కరివేపాకు మాత్రం తీసేసేది కాదండి… ఇది వంటలకు రుచి, సువాసన ఇవ్వడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సైతం అందిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

– శరీరంలోని విష వ్యర్థాల్ని కరివేపాకు తరిమేస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యకు చెక్‌ పెడతాయి.
– డయేరియా సమస్యకు సరైన పరిష్కారం కరివేపాకు. దీనిలో కారిబాజోల ఉంటుంది. అది విరేచనాలకు బ్రేక్‌ వేస్తుంది. అందుకే ప్రతీ కూరలో కరివేపాకు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
– దగ్గు, జలుబులకు చెక్‌ పెడుతుంది. అందుకే ఈ కాలంలో తప్పక వాడాలి.
– కరివేపాకులో ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది రక్త హీనతను తగ్గిస్తుంది.
– కరివేపాకుల్లో యాంటీఆక్సిడెంట్స్‌ చాలా ఉంటాయి. అవి బాడీలో షుగర్‌ లెవెల్స్‌ని కంట్రోల్‌ చేస్తాయి. డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు కరివేపాకు తింటే ఎంతో మంచిది.
– కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కరివేపాకుల్ని ఉడకబెట్టి తాగితే మంచిదే. యూరినరీ సమస్యలకు కూడా కరివేపాకు బాగా పనిచేస్తుంది.
– సరైన పోషకాలు లేని వారికి జుట్టు తెల్లబడుతుంది. అలా జరగకుండా ఉండేందుకు కరివేపాకులు సాయపడతాయి. జుట్టు బాగా పెరిగేందుకు కూడా సహకరిస్తాయి.
– శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించేందుకు కరివేపాకు బాగా పనిచేస్తుంది. చర్మాన్ని కూడా కాపాడతాయి.