అభివృద్ధి భాటలో ఆమనగల్‌

– జడ్పీటీసీ సభ్యులు నేనావత్‌ అనురాధ పత్య నాయక్‌
– త్వరలో ఏసీపీ, ఆర్‌ డీఓ, ఏడీఏ, డిగ్రీ,పాల్టెక్నిక్‌ కళాశాలల ఏర్పాటు
నవతెలంగాణ-ఆమనగల్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్‌ యాదవ్‌ సహకారంతో ఆమనగల్‌ మున్సిపాలిటీ అభివృద్ధి బాటలో పయనిస్తుందని జిల్లా సాంఘీక సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ చైర్మెన్‌, ఆమనగల్‌ జడ్పీటీసీ సభ్యులు నేనావత్‌ అనురాధ పత్య నాయక్‌ అన్నారు. సోమవారం ఆమనగల్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి వారు మాట్లాడారు. ఆమనగల్‌ పీహెచ్‌ సీనీ సీహెచ్‌ సీగా అప్‌ గ్రేడ్‌ చేయడం, నాలుగు మండలాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందుబాటులో కోర్టు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవనం, అధునాతన గ్రంథాలయ, జూనియర్‌ కళాశాల భవనం, రూ.15 కోట్లతో ఆమనగల్‌ మున్సిపాలిటీ అభివృద్ధి, కోట్ల రూపాయలు వెచ్చించి బంజార భవనం, ధోభీ ఘాట్‌, అదేవిధంగా లక్షల రూపాయలు వెచ్చించి వివిధ సంఘాల కమ్యూనిటీ భవనాలను నిర్మస్తున్నట్టు వారు గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆమనగల్‌ మున్సిపాలిటీ అధ్యక్షులు డాక్టర్‌ నేనావత్‌ పత్య నాయక్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు తల్లోజు రామకృష్ణ, ఉప్పుల రాములు యాదవ్‌, సయ్యద్‌ ఖలీల్‌, పూసల సత్యం, వస్పుల సాయిలు, ఏఎంసీ డైరెక్టర్‌ రమేష్‌ నాయక్‌, వడ్డే వెంకటేష్‌, శివకుమార్‌, యాదయ్య, జంతుక అల్లాజీ, గణేష్‌ నాయక్‌, మహేష్‌, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.