మణిపూర్‌ ఘటనపై అమెరికా తీవ్ర ఆందోళన

న్యూఢిల్లీ : దేశంలో తీవ్ర ఆందోళనకు దారి తీసిన మణిపూర్‌ వైరల్‌ వీడియోపై యూఎస్‌ స్పందించింది. కుకీ తెగ మహిళలను నగంగా ఊరేగించిన ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసిందని వెల్లడించింది. ఈ ఘటన క్రూరమైనది, భయంకరమైనదని యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి అన్నారు. ప్రాణాలతో బయటపడినవారికి యూఎస్‌ తన సానూభూతిని తెలియజేసిందని వివరించారు.మణిపూర్‌లోని కాంగ్‌పోక్పిలో ఇద్దరు కుకీ మహిళలను నగంగా ఊరేగించిన ఘటన ఈనెల 19న సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి తీవ్ర ఆందోళనలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.