అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

– సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్‌
నవతెలంగాణ-ఇల్లందు
అంగన్వాడీ, అశాలు, మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్‌ అన్నారు. సమ్మె శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించి, మాట్లాడారు. వారికి కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్‌, రిటైర్‌ మెంట్‌ బెనిఫిట్‌ గ్రాడ్యుటీ, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రూ.4 లక్షలు, మంత్రులకు రూ.3లక్షల యాభై వేలు, ఎమ్మెల్యేలు రూ.రెండున్నర లక్షలు గౌరవ వేతనాలు తీసుకుంటున్నారు, కానీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి అమలు చేస్తున్న స్కీం వర్కర్లకు కనీస వేతనం ఎందుకు ఇవ్వరని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్‌ సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుల్తానా అధ్యక్షత వహించగా సీఐటీయూ జిల్లా నాయకులు అబ్దుల్‌ నబి, ఈసం వెంకటమ్మ, కే.మరియా ఫాతిమా, ఏఐటీయూసీ మమత, నాగలక్ష్మి, వసంత, దేవేంద్ర, అరుణ, ఆశా నేతలు చీమల రమణ, చంద్రకళ, జీ.ఉమాదేవి, డి.సునిత, మల్లేశ్వరి, లక్ష్మి, కరుణ, అరుణ, చుంచు విజయ, మధ్యాహ్న భోజన కార్మిక నేతలు కుమారి, యాదమ్మ, సరిత, విజయ, లక్ష్మి, పద్మ, సీఐటీయూ జిల్లా నాయకులు కూకట్ల శంకర్‌, మన్యం మోహన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.
గుండాల : ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వకపోగా సమ్మెలో ఉన్న కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యహరిస్తున్నదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్‌ అన్నారు. ఈ మేరకు ఆదివారం గుండాల మండల కేంద్రంలో సమ్మె వద్ద ఆయన మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన చలో హైదరాబాద్‌కు అంగన్వాడీ సంఘాలు పిలుపు నిచ్చాయన్నారు. అనంతరం సీఐటీయూ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్‌ నబి, టీఏజీఎస్‌ జిల్లా నాయకులు తోలెం మల్లయ్య, సాయనపల్లి సర్పంచ్‌ దుగ్గి రామ్మూర్తిలు సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సభకు వజ్జ సుశీల, పాయం సారమ్మలు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, జావ్వాజి పద్మ, కౌసల్యా, కళావతి, నీలిమ, ధనమ్మ, పూలమ్మ, వెంకటమ్మ, సరోజ, ఆశాలు అదిలక్ష్మి, వినోద, ఈశ్వరి, లక్ష్మీ, జయమ్మ, మధ్యాహ్న భోజన కార్మికులు పొంబోయిన లక్ష్మీ, నర్సమ్మ, చంద్రక్క, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం రూరల్‌ : మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని సీఐటీయూ పట్టణ కన్వీనర్‌ ఎంబి.నర్సారెడ్డి అన్నారు. ఆదివారం నాలుగో రోజు దీక్షలను ప్రారంభించి, మాట్లాడారు. గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు గతంలో సమ్మె చేసినప్పుడు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో రూ.2000 వేతనం పెంచుతున్నామని ప్రకటించి నేటికి కూడా ఆ నిధులు విడుదల చేయలేదని, వెంటనే వాటిని విడుదల చేయాలన్నారు. నాలుగో రోజు సమ్మెకు సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి సంఘీభావం తెలియజేశారు. అంగనవాడీ యూనియన్‌ బాధ్యులు కార్యదర్శి లలిత, సీనియర్‌ అంగన్వాడి నాయకులు విపుల విజయలక్ష్మి, తిరుపతమ్మ తదితరులు సంఘీభావం తెలియజేశారు. ఆ సంఘం నాయకులు పిలక శివమ్మ, అక్కల జ్యోతి, సభ్యులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : అంగన్‌ వాడీల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉదృతం చేస్తామని సిఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొనసాగుతున్న అంగన్‌వాడీల దీక్షలు ఆదివారం నాటికి 21వ రోజు చేరాయి. ఈ సందర్భంగా బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన అంగనవాడి నిరవధిక సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కళావతి, శైలజ, జుబేదా, రత్నకుమారి, అరుణ, అంజమ్మ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : పట్టణంలో ఆశా వర్కర్లు చేస్తున్న ఏడవ రోజు నిరవదిక సమ్మెకు బీఎస్పీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పి ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జ్‌ బాధాత్‌ ప్రతాప్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు లతాకుల కాంతారావు, చిప్పలపల్లి శ్రీనివాసరావు, మండల నాయకులు కిరణ్‌, అరుణ్‌, లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు: ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా ఆదివారం మణుగూరులో అంగన్వాడీలు బతుకమ్మలతో ఆట పాటలు ఆడి నిరసన తెలియజేశారు. ఎంపీడీవో కార్యాలయం నుండి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు. సమస్య పరిష్కారాంతవరకు సమ్మె విరమించేది లేదని అంగనవాడి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్యామల, హేమలత, మల్లేశ్వరి, భారతి, విజయ, అరుణ, సావిత్రి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ: రూ.18 వేలు వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆశా కార్యకర్తలు ఆదివారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కళ్ళకు గంతలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనియన్‌ మండల అధ్యక్షురాలు జనగామ రుక్మిణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, జ్యోతి, కె.అరుణ, బి.పుణ్యవతి, లక్ష్మీ, శిరోమణి తదితరులున్నారు.
ములకలపల్లి: స్కీంవర్కర్లు సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఆశావర్కర్లు, మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేసి మాట్లాడారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు పొడియం వెంకటేశ్వర్లు, మాలోత్‌ రావుజా, గౌరి నాగేశ్వరరావు, వూకంటి రవికుమార్‌, గొగ్గల ఆదినారాయణ, గోపగాని లక్ష్మీ నరసయ్య, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.