హాజిపూర్ లో అంగన్ వాడి భవనం ప్రారంభం

నవతెలంగాణ – నసురుల్లాబాద్
మండలంలోని హాజిపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్ వాడి భవనాన్ని శుక్రవారం ఎంపిపి పాల్త్య విఠల్ , బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ ప్రారంభించారు. . ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడి కేంద్రలలో గర్భిణులకు అద్భుతమైన ఆహారాన్ని అందిస్తున్నదని గత ప్రభుత్వాలలో భవనాలు కూడా సరిగా లేకపోయేవని స్వరాష్ట్రంలో అద్దాల్లా భవనాలు నిర్మించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జన్నుబాయి ప్రతాప్ సింగ్, జడ్పి కో అప్షన్ మెంబర్ మజీద్, స్థానిక సర్పంచ్ అరిగే సాయిలు, సొసైటీ అధ్యక్షుడు గంగారాం, ఎంపీటీసీ నారాయణరెడ్డి, ఐసిడిఎస్ అధికారులు కళావతి, వాణీ, సాయిలు యాదవ్, తదితరులు హాజరయ్యారు.