– ఎన్‌సీఎల్‌టీ గ్రీన్ సిగల్
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కు చెందిన పలు రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించేందుకు ముంబై ఎన్‌సీఎల్‌టీ ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. ఆర్‌కామ్ పలు రుణదాతల నుంచి భారీగా అప్పులు తీసుకుని చెల్లించడంలో విఫలం అయ్యింది. దాంతో ఆ సంస్థ దివాళా పిటిషన్ దాఖలు చేయడంతో ఎన్‌సిఎల్‌టి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌కామ్‌కి చెందిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ కంపెనీకి చెందిన కొన్ని అపరిమిత ఆస్తుల విక్రయాన్ని చేపట్టేందుకు అనుమతి లభించింది. ఈ ట్రిబ్యునల్ ఆమోదం కోసం రిజల్యూషన్ ప్లాన్‌ను సమర్పించిన తర్వాత సీఐఆర్‌ఎఫ్ రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 29 ప్రకారం దరఖాస్తుదారు కార్పొరేట్ రుణగ్రహీత ఆస్తులను విక్రయించవచ్చని ఈ ట్రిబ్యునల్ స్పష్టం చేస్తుంది. వాస్తవానికి 2016లో ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ప్రారంభించిన తర్వాత టెలికం రంగంలో తీవ్ర పోటీతత్వం పెరిగి అనిల్ అంబానీ సంస్థ పరిస్థితి చాలా దిగజారింది. ఆర్‌కామ్ భారీ నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత తన బ్యాంక్ రుణాలను చెల్లించటంలో విఫలం అయి చివరికి దివాలా ప్రక్రియలోకి వెళ్లిపోయింది. ఆర్‌కామ్ చెన్నరు హాడో ఆఫీసు, అంబత్తూర్‌లో సుమారు 3.44 ఎకరాల స్థలం, పూణెలోని 871.1 చదరపు మీటర్ల స్థలం, భూవనేశ్వర్‌లోని బేస్డ్ ఆఫీసు స్పేస్, క్యాంపియన్ ప్రాపర్టీస్ షేర్లలో పెట్టుబడి, రిలయన్స్ రియాల్టీ షేర్లలో పెట్టుబడులను విక్రయానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.