మరో అరుదైన గౌరవం

Another rare honorచిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. అంతర్జా తీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్‌)ను నిర్వహించనుంది. ఈ వేవ్స్‌ అడ్వైజరీ బోర్డ్‌లో చిరంజీవికి స్థానం దక్కడం విశేషం. ఈ నేపథ్యంలో పలువురు సినీ, పారిశ్రామిక ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చిరంజీవి, సుందర్‌ పిచారు, సత్య నాదేళ్ల, ముఖేష్‌ అంబానీ, ఆనంద్‌ మహీంద్రా, అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌, మోహన్‌ లాల్‌, రజనీకాంత్‌, అమీర్‌ ఖాన్‌, ఏఆర్‌ రెహమాన్‌, అక్షయ కుమార్‌, రణ్‌ బీర్‌ కపూర్‌, దీపిక పదుకొణె తదితరులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఆర్థిక రంగం కోసం దావోస్‌లోని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఎలా జరుగు తుందో?, వినోద పరిశ్రమ కోసం అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుగా వేవ్స్‌ను రూపొందిస్తున్నారు. వినోదం, సజనాత్మకత, సంస్కతిలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా అభివద్ధి చేయడం దీని లక్ష్యం. ‘వేవ్స్‌’ అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం పట్ల చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘ఇంతటి మహోత్తరమైన కార్యక్రమంలో భాగం చేసిన ప్రధాన మంత్రి మోదీకి ధన్యవాదాలు. వేవ్స్‌ అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం, ఇతర గౌరవనీయమైన సభ్యులతో పాటుగా నా ఆలోచనల్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. మోదీ మానస పుత్రిక అయిన వేవ్స్‌ భారతదేశాన్ని ప్రపంచ వేదికలపై సగర్వంగా చాటుకునేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలో జరగనున్న అద్భుతాల కోసం మనమంతా ఎదురచూస్తుండాలి’ అని చిరంజీవి పేర్కొన్నారు.