ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 35 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలి

నతెలంగాణ- కంటేశ్వర్
2023-25 మద్యం దుకాణాల పాలసీ కి సంబంధించిన నోటిఫికేషన్ ను ఎక్సైజ్ శాఖ,తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినందున నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 35 మద్యం దుకాణాలకు ఆసక్తి కల ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నిజామాబాద్ బి దిలీప్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ పట్టణంలోని గెజిట్ నంబర్ 20 కు ఎస్టి రిజర్వేషన్ గెజిట్ నంబర్ 03,08, లకు ఎస్సీ రిజర్వేషన్; గెజిట్ నంబర్ 11 కు గౌడ్ రిజర్వేషన్, నందిపేట లోనీ గెజిట్ నంబర్ 28,29,30, ల కు ఎస్సీ రిజర్వేషన్, కేటాయించగా మిగిలిన 28 దుకాణాలకు ఓపెన్ కేటగిరీ కింద కేటాయించినట్లు తెలుపుతూ, దీనికై దరఖాస్తు చేయడానికి 21 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ అర్హులని, దీనికై 2 లక్షల రూపాయిల డీడీ లేదా చలనా తీసి జిల్లా ప్రోహిబీషన్ మరియు ఎక్సైజ్ అధికారి, నిజామాబాద్ జిల్లా కార్యాలయం నందు దరఖాస్తు చేయాలని, ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చని మరియు ఒక వ్యక్తి ఒక దుకాణానికి ఎన్ని దరఖాస్తులైన చేసుకోవచ్చని, దరఖాస్తు ఫారం తో పాటు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు,స్వీయ ధృవీకరణ తో కూడిన ఆధార్,పాన్ కార్డ్ జీరాక్స్ కాపీలు, రిజర్వ్ అయిన దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వారు కుల ధృవీకరణ పత్రం లను అందచేసి చివరి తేదీ 18 లోగా జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగలరని తెలియజేశారు.