నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వేద పాఠశాలలకు ఇచ్చే గ్రాంటుతో పాటు వేద పండితులకు నెలవారి గౌరవభృతికి https://brahminparishad telangana.gov.in ద్వారా ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్ట్టు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అడ్మినిస్ట్ట్రేటర్ రఘురాంశర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.. ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నటు పేర్కొన్నారు. వార్షిక గ్రాంటు, గౌరవభృతి కోసం మార్గదర్శకాల ప్రకారం సంబంధిత పోర్టల్ ద్వారా సరియైన ధవపత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.