– ముగ్గురికి చోటు దక్కే అవకాశం
– కేసీఆర్ సర్కారులో ముగ్గురికి అవకాశం
నవతెలంగాణ – కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 13 నియోజకవర్గాల్లో ఎనిమిది మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారిలో మంథని నియోజక వర్గం నుంచి గెలుపొందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు హుస్నాబాద్ నియోజకవర్గంలో నుంచి గెలుపొందిన పొన్నం ప్రభాకర్ వేములవాడ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాసులకు మంత్రి పదవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలోని కే తారక రామారావు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ ఈటెల రాజేందర్ లకు మంత్రి పదవులు దక్కాయి. ఈటెల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం మంత్రి పదవిని తొలగించింది ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు పనిచేశారు ఈ ప్రాతిపాదికనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇస్తుందని చర్చ జరుగుతుంది.
దుద్దిళ్లకు పదేళ్ల తర్వాత మళ్లీ మంత్రి పదవి..
మంథని నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలుపొందిన దుద్దుల శ్రీధర్ బాబు గతంలో అనేకసార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీధర్ బాబు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన శాసనసభ్యునిగా ఓటమి చెందారు 2018 ఎన్నికల్లో పుట్ట మధుపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ లో మంచి పేరున్న నాయకుడిగా కష్టకాలంలో కూడా పార్టీని పట్టుకొని ఉన్న నేతగా ఆయనకు పేరు ఉండడంతో ఈసారి ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సాధకుడికి మంత్రి పదవి..
కరీంనగర్ కు చెందిన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశ నుంచి ఎన్ ఎస్ యుఐ లో పనిచేసే తదుపరి కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు పొందారు. అనేకసార్లు ఆయనపై పార్టీ మారాలనే ఒత్తిడి వచ్చిన ఆయన పార్టీ మారకుండా ఉన్నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదాలు పొన్నం ప్రభాకర్ కు ఉండేవి వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పొన్నం ప్రభాకర్ కు రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ గా పదవిని ఇచ్చారు తదుపరి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా పనిచేశాడు ఆ సమయంలో పొన్నం ప్రభాకర్ ను రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షునిగా వైఎస్ చేశాడు అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో అధికార పార్టీలో ఉండి కూడా పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టాలని ఉద్యమం చేశాడు ఆ సమయంలో ఆయనపై పెప్పర్ స్ప్రే దాడి పార్లమెంటులో జరిగింది అప్పటినుంచి ఇప్పటివరకు పొన్నం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు సీనియర్ కాంగ్రెస్ నేత కావడంతో పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి వస్తుందని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రాజన్న దయతో శీనన్నకు మంత్రి పదవి వచ్చేనా..
వేములవాడ నియోజకవర్గం నుంచి ఆది శ్రీనివాస్ 5 సార్లు పోటీ చేశారు నాలుగు సార్లు ఓటమి చెంది ఐదవ సారి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుపై విజయం సాధించారు. ప్రధానంగా సానుభూతి రావడంతో లక్ష్మీనరసింహారావు వేములవాడకు కొత్త వ్యక్తి కావడం ఆయన గెలుపుకు కారణంగా చెప్పవచ్చు అంతే కాకుండా ఆది శ్రీనివాస్ వ్యక్తిగతంగా నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండేవాడు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఇంతకుముందు కేటీఆర్ మంత్రిగా పని చేశారు ఈసారి శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్ గెలుపొంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి ఓటమి చెందాడు జిల్లాలో ఓ ప్రత్యేక స్థానం ఉండాలంటే తప్పనిసరి ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.