సాగు నీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా…?

టీజేఏసీ జిల్లా చైర్మన్‌ ముకుంద నాగేశ్వర్‌
నవతెలంగాణ-దోమ
ప్రజలు పదేళ్లు అధికారం ఇచ్చి తొమ్మిదేళ్లు పూర్త యినా ప్రాజెక్టులు పూర్తిచేయడం చేతగానోళ్లు పర నింద వేయడం మంచిది కాదనీ టీజేఏసీ జిల్లా చైర్మన్‌ ముకుంద నాగేశ్వర్‌ సోమవారం ఓక ప్రకటనలో తెలి పారు. చేవెళ్లలో ప్రెస్‌ మీట్‌ పెట్టిన ఈ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలకు 2008లో అప్పటి, ఇప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి పాల్గొని శంకుస్థా పన చేసిన ప్రాణహిత చేవెళ్ల శిలాఫలకం కనిపించ లేదా అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2 లక్షల 45 వేల ఎకరాలకు రావాల్సిన నీటిని ఇవ్వ కుండా కాలేశ్వరం పేరుతో రీడిజైన్‌ చేసి ఉత్తర తెలం గాణకే పరిమితం చేసి ఈ ప్రాంత రైతుల పొట్ట కొట్టి న కాలేశ్వరం గొప్ప ప్రాజెక్టు ఎట్లా అవుతుందన్నారు. తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ ఫోరం సభ్యులు జూరాల ఫ్లడ్‌ వాటర్‌ ఆధారంగా డిజైన్‌ చేసి అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో సర్వే పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ ఎందుకు రీ డిజైన్‌ చేశారని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత రీ-డిజైన్‌ చేసి 2015లో శంకుస్థాపన చేసిన పాల మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులలో భాగంగా తెలంగాణలోనే ఎత్తయిన ప్రాంతంలో ఉన్న కొందుర్గు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌, కాలువల పను లు కనీసం ప్రారంభించకుండా 90 శాతం ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం విడ్డూరంగా లేదా అనీ పేర్కొ న్నారు. ‘మీ పార్టీలో చేరిన కాంగ్రెస్‌కి చెందిన 13 మంది ఎమ్మెల్యేలలో కోర్టులో కేసు వేసిన కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి కూడా ప్రస్తుతం మీ పార్టీ లోనే ఉన్నప్పుడు కేసులు వేసి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకుంటున్నది ఎవరు..? ఎన్ని కేసులు ఉన్నా మూడేళ్లలో లక్ష కోట్ల రూపాయ లతో కాలేశ్వరాన్ని పూర్తి చేశామని గొప్పగా చెప్పుకుం టున్న మీరు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పూర్తి చే యడానికి వస్తున్న అడ్డంకులు ఏమిటి అనీ, అధి గ మించడానికి ఇంకెంత కాలం పడుతుందని’ అని ప్ర శ్నించారు. మూడేళ్లలో కాలేశ్వరం పూర్తి చేశాం అంటు న్న పాలకులు ఈ తొమ్మిదేళ్లలో పాలమూరు-రంగా రెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును, ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన రూ.80 వేల కోట్ల అప్పులో రూ.36 వేల కోట్లతో పూర్తి చేసి ఉంటే సుమారుగా 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు వచ్చేవి క దా అనీ తెలిపారు. కేసీఆర్‌ ఉత్తర తెలంగాణ సాగునీ టి ప్రాజెక్టులపై ఉన్న సోయి దక్షిణ తెలంగాణలో పూ ర్వ రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులపై లేకపో తే గొప్ప నాయకుడు ఎట్లా అయితడు, ఆయనను చూసి ప్రజలు ఓట్లు ఎట్లా వేయాలనీ. ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తే మర్యాదపూర్వకంగా కలవని, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా దేశ రాజధానిలో ప్రధాని కలవని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రాజెక్టుల జాతీయ హౌదా కోసం ఎంతవరకు ప్రయత్నించారో కేంద్రం జాతీయ హౌదా ఎందుకు ఇవ్వలేదో కేసీఆర్‌, ప్రజా ప్రతినిధులే సమాధానం చెప్పాలని’ తెలిపారు. సీఎం కేసీఆర్‌ 3 పంటల సాగుకు కృషి చేస్తున్నారంటున్న ఎమ్మెల్యే ఆనంద్‌ జిల్లాలో, పూర్వ రంగారెడ్డి జిల్లాలో ఏ ఊర్లో, ఎన్ని ఎకరాల్లో 3 పంటల సాగుకు కృషి చేస్తున్నారో వివరాలు చెప్పా లని కోరారు. పరిగి మునిసిపా లిటీలో భూగర్భ జలాలను పెంచే గతంలో నీళ్లతో కళకళలాడి ప్రస్తుతం కబ్జాలకు గురి అవుతున్న పరిగి కొత్తచెరువు అభివృద్ధిని పట్టించుకోని, ప్రధాన రోడ్డు నుంచి నరస య్య గూడ, రావులపల్లి, లింగంపల్లి లాంటి చాలా గ్రా మాలకు కనీస బీటీ రోడ్డు వేయించని ఎమ్మెల్యే మహే ష్‌ రెడ్డి ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నుండి పరిగికి కాలువల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 వేల కోట్ల జీ వో విడుదల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉం దని తెలిపారు. చేవెళ్ళ ఎంపీ రంజిత్‌ రెడ్డి వరంగల్‌ ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ ఆప్రాంత ప్రజలు చేవెళ్ల ఎంపీగా గెలిపిస్తే సొంత జిల్లాకు సాగునీరు తీసుకెళ్లి, రాజకీయ భిక్ష పెట్టిన ఎంపీగా గెలిపించిన ఈ ప్రాంత రైతులకు ప్రాణహిత చేవెళ్ల, పాలమూ రు-రంగారెడ్డి ప్రాజెక్టుల నుంచి కనీసం ఒక్క ఎకరా కు కూడా నీరు ఇవ్వకుండా అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం అనీ ప్రశ్నించారు. తొమ్మిదే ళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో ఈ ప్రాంత మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల అసమర్ధత, చేతగాని తనం, అవగాహనా రాహిత్యాన్ని ఇతర పార్టీ ల మీద, ప్రభుత్వాల మీద, వ్యక్తుల మీద నెట్టి వేయ డం సరికాదని పేర్కొన్నారు.