కేసీఆర్‌ను కలిసిన అరీబ్‌ షాహెజాన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సిద్ధిపేటకు చెందిన అరీబ్‌ షాహెజాన్‌ తన కుమారుడు మహమ్మద్‌ ఇఫ్తేకార్‌తో కలిసి సోమ వారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వారికి పార్టీ కండువా కప్పి కష్టపడి పార్టీ కోసం పని చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. మహమ్మద్‌ ఇఫ్తేకార్‌ కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో తన కుమారునికి మంచి పదవీ బాధ్యత ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. ఈ సందర్బంగా ఆయన సీఎం కేసీఆర్‌కు రక్షాబంధన్‌, ఉపాధ్యాయ దినోత్సవం, వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.