– ఐదు నియోజకవర్గాల్లో 1095 పోలింగ్ కేంద్రాలు
– ఓటు హక్కును వినియోగించుకోనున్న 955094 మంది ఓటర్లు
– ఈ నెల 31 వరకు ఓటు హక్కు నమోదుకు అవకాశం
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక అలా
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్రంలో నవంబర్ 30న జరగనున్న శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని ఐదు నియోజకవర్గాలైన పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గం 1095 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో 945094 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 461315 మంది మహిళలు ఓటర్లు, 483741 మంది పురుషులు, 38 మంది ట్రాన్స్ జెండర్లు, 43 మంది ఎన్నారైలు, 731 మంది సర్వీస్ ఓటర్లు, 14930 మంది వికలాంగ ఓటర్లు, 18 నుండి 19 ఏండ్లున్న యువ ఓటర్లు 22096 మంది, 80 ఏండ్లు పైబడిన 13082 మంది వయోవృద్ధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అలా నవతెలంగాణతో మాట్లాడారు. ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వాహనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ నెల 31వ తేదీ వరకు 18 ఏండ్లు నిండిన వారెవరైనా ఓటు హక్కు నమోదు చేసుకోకపోతే అలాంటివారు నమోదుకు అవకాశం ఉందని చెప్పారు. తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆరోగ్యం సహకరించని వికలాంగులు, 80 ఏండ్లు పైబడిన వయోవృద్ధులు ఆరోగ్యం సహకరించగా మంచానికి పరిమితమైన వారి కోసం ఫారం 12 ద్వారా ఇంటి నుండే ఓటు హక్కు వినియోగానికి అంగీకార పత్రాన్ని తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రచారాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి కోసం సువిధ ఆన్లైన్ యాప్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి విరుద్ధంగా పార్టీలు చేసే ప్రకటనపై దుస్థితి సారించి తగిన చర్యలు ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. జిల్లాలో గుర్తించిన 294 సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ పరిశీలనకు సూక్ష్మ పరిశీలకులను నియమిస్తున్నామని, ఆయా కేంద్రాల్లో భద్రత సిబ్బందితోపాటు ఓటేస్తే ఇప్పుడు జారీ చేసే సమయంలో బిఎల్వోలు అప్రమత్తంగా విధులు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎన్నికల సంఘం మార్గదర్శకత ప్రకారం రూ.50,000 కన్నా ఎక్కువ నగదు పట్టుకుంటే ముగ్గురు అధికారులు కమిటీ పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్న సొమ్మును భద్రపరుస్తున్నామన్నారు. సొమ్ము పక్క దారి పట్టకుండా జిల్లా సహకార శాఖ అధికారి నోడల్ అధికారిగా డిఆర్డిఓ ట్రెజరర్ అధికారులు జిల్లా గ్రీవెన్స్ కమిటీనిగా ఉంటుందని స్వాధీనం చేసుకున్న వస్తువులు సొమ్ము పై విచారణ జరిపి చర్యలు తీసుకునే అధికారం కమిటీ ఉంటుందన్నారు. ఎన్నికల్లో అక్రమాలను ఖరారు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం టు జీరో వన్ ఎయిట్‌లో సి విజిల్ యాప్ అందుబాటులోకి తెచ్చిందని ఓటర్లను ప్రలోబాల గురిచేసిన అక్రమాలకు పాల్పడిన యాప్ ద్వారా తెలియజేయడం పై ప్రచారం కల్పిస్తున్నామన్నారు. ఓటర్లు మభ్యపెట్టేందుకు డబ్బు మద్యం పంపిణీ అరికట్టేందుకు 24 గంటల పాటు పనిచేసేలా ప్రతిష్ట పర్యవేక్షణ ప్లైన్ స్టార్ట్స్ స్టాటిస్టిక్స్ సర్వే లైన్ వీడియో సర్వే లైన్స్ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎవరైనా అభ్యర్థులు తరఫున ఇతరులు ఓటర్లను మభ్యపెట్టి ఎందుకు ప్రయత్నిస్తే ఎన్నికల సంఘం నిబంధన మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటింపు పై రాజకీయ పార్టీలు నాయకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.