– డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండల కల నెరవేరింది పై చదువుల కోసం డిగ్రీ కళాశాల అత్యవసరమని ఏళ్ల తరబడి ఈ ఉమ్మడి మండల ప్రజలు కోరుకోవడం ఉద్యమాలు చేపట్టడం ప్రజల ఆశయం మేరకు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే ఎట్టికేలకు డిగ్రీ కళాశాల మంజూరు చేయించారు. మంజూరైన డిగ్రీ కళాశాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేస్తూ మంగళవారం నాడు డిగ్రీ కళాశాల ఎమ్మెల్యే హనుమంతు సిందే చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మైథిలి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే అనుమంతు షిండే మాట్లాడుతూ.. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు విద్యాభివృద్ధి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని గురుకుల పాఠశాలలో ఏర్పాటు జూనియర్ కళాశాలల ఏర్పాటు డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మన ఊరు మనబడి పథకంలో ప్రతి గ్రామంలో పాఠశాలల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి అంటే విద్యా వైద్యం రోడ్లు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా విద్య వైద్యం రోడ్లు త్రాగునీటి సమస్య సాగునీటి సమస్య అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. జుక్కల్ ప్రజల సేవ కోసమే ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని ఏఏ మండలాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు అవసరమో వాటి గురించి తనకు అన్ని విధాలుగా అవగాహన ఉందని జుక్కల్ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీపీ వాగ్మారీ లక్ష్మీబాయి జెడ్పిటిసి సభ్యురాలు అనిత కతలయ్య మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సురేష్ డాక్టర్ బండి వార్ విజయ్ రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ దిగంబరావ్ పాటిల్ మద్నూర్ సింగిల్ విండో మాజీ అధ్యక్షులు పాకల విజయ్ బీఆర్ఎస్ పార్టీ మద్నూర్ మండల అధ్యక్షులు బన్సీ పటేల్ డోంగ్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శశాంక్ పాటిల్ బిచ్కుంద జుక్కల్ మండలాల జడ్పిటిసిలు ఎంపీపీలు మూడు మండలాల్లోని సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లెక్చరర్లు జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.