వయసు పెరిగే కొద్దీ…

As you get older...సాధారణంగా వయసు పెరిగేకొద్దీ శరీరంలో ఆయా అవయవాల పనితీరు కూడా కాస్త నెమ్మదిస్తుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ. ఈ పరిస్థితుల్లో మరీ జీర్ణంకానటువంటి పదార్థా లను తీసుకుంటే సమస్య జఠిలమవుతుంది. అలాగే వయసు పెరిగి వృద్ధాప్యంలో పడుతున్న సమయంలో శరీరానికి శక్తి కూడా కావాలి. కాబట్టి తగిన పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి
– వృద్ధుల్లో విటమిన్‌ డి, క్యాల్షియం, విటమిన్‌ బీ12, పీచు, పొటాషియం వంటి ప్రత్యేకమైన పోషకాల అవసరం చాలా ఎక్కువ. తక్కువ కొవ్వు పాల పదార్థాలు, ఆకు కూరలు, చేపలు తగినంతగా తీసుకోవటం ద్వారా విటమిన్‌ డి, క్యాల్షియం లభిస్తుంది. ఇవి ఎముక పుష్టికి దోహదం చేస్తాయి.
– చేపలు, సముద్ర ఆహారం, తేలికైన మాసం నుంచి విటమిన్‌ బి 12 అందుతుంది. సాధారణంగా వృద్ధాప్యంలో తప్పనిసరిగా వేధించే సమస్య మలబద్ధకం. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం అధికంగా తీసుకుంటే ఈ బాధ నుంచి తేలికగా బయటపడొచ్చు. వీటన్నింటిలో పీచు సమృద్ధిగా ఉంటుంది.
– పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల పదార్థాల్లో వృద్ధు లకు అవసరమైన పొటాషియం కూడా ఉంటుంది. అందరిలాగే వృద్ధులు కూడా నూనె పదార్ధాలు, వేపుళ్లు తగ్గించటం శ్రేయస్కరం. ముఖ్యంగా నెయ్యి, డాల్డా వంటి సంతృప్త కొవ్వులు తగ్గించి పొద్దు తిరుగుడు నూనె వంటివి, అదీ మితంగా తీసుకుంటే మంచిది.
As you get older...ఆరోగ్యానికి ఎంతో మేలు
మనం తినే పండ్లలో అరటిపండు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం. తరచుగా అరటిపండ్లు తింటూ ఉంటే… చాలా ప్రయో జనాలు కలుగుతాయి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. పైగా ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా తిన్న ఆహారం అరగక ఇబ్బంది పడేవారు అరటిపండ్లు తింటూ ఉంటే… జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది.
– కొంతమంది హైపర్‌ టెన్షన్‌ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు అరటిపండును తినడం మేలు. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అది పరిష్కారం చూపిస్తుంది.
– అరటిపండులో సహజమైన యాంటీ-యాసిడ్‌ ఉంటుంది. ఇది పొట్టలో సమస్యలకు చెక్‌ పెడుతుంది. అలాగే అరటిలోని షుగర్‌ శరీరానికి బలాన్ని ఇస్తుంది.
– ఈ పండులో ఫైబర్‌ ఎక్కువ. అందు వల్ల మలబద్ధకం సమస్యకు ఇది చెక్‌ పెడుతుంది.
– అరటిపండు ఎంత మంచిదైనా రాత్రి సమయంలో దీన్ని తినకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే… అరటికి బాడీలో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అందువల్ల ఆల్రెడీ చల్లగా ఉన్న శరీరాన్ని ఇది మరింత చల్లబరిచి దగ్గు, జలుబు వచ్చేందుకు కారణం అవుతుంది. అందువల్ల అర్థరాత్రిళ్లు తప్ప మిగతా రోజంతా ఈ పండును తినవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
– పెద్ద అరటిపండ్లు జీర్ణం కావడానికి కాస్త ఎక్కువ టైమ్‌ తీసుకుంటాయి. అందువల్ల పడుకునే 2 లేదా 3 గంటల ముందే ఈ పండును తినేయాలి. ఆ తర్వాత తినకపోవడం మేలు.
– జలుబు, దగ్గుతో బాధపడేవారు అరటిపండ్లు తినకూడదు. తింటే అవి మరింత ఎక్కువవుతాయి. రాత్రివేళ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందువల్ల రాత్రిళ్లు ఈపండు తింటే వెంటనే జీర్ణం కాదు. తద్వారా నిద్రపట్టని సమస్య కూడా ఎదురవుతుంది.