అశ్వారావుపేటలో గతం కంటే పెరిగిన పోలింగ్ శాతం..

 
– నియోజక వర్గం పోలింగ్ 86.88%
నవతెలంగాణ – అశ్వారావుపేట: తెలంగాణ సాదారణ ఎన్నికల్లో గురువారం నిర్వహించిన పోలింగ్ లో అశ్వారావుపేట నియోజకవర్గంలో 86.88 శాతం నమోదు అయింది. ఇది గతం కంటే మెరుగైన పోలింగ్ గా నమోదు అయిందనే చెప్పొచ్చు. మొత్తం ఓటర్లు 1,55,961 మంది ఉండగా 1,35,501 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 76,193 మంది పురుష ఓటర్లుకు గానూ 66,602 మంది ఓటు వేసారు.79,761 మంది మహిళా ఓటర్లకు గానూ 68,895 మంది పోలింగ్ లో పాల్గొన్నారు. 7 మంది ఇతరులకు గాను నలుగురు ఓటింగ్ లో భాగస్వామ్యం అయ్యారు. పోలింగ్ శాతాన్ని ఇంకా పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

 

మండలాలు వారీగా 2023 సాదారణ ఎన్నికల పోలింగ్ శాతం:

మండలం పోలింగ్ శాతం
ములకలపల్లి 89.83
చండ్రుగొండ 88.26
దమ్మపేట 87.88
అన్నపురెడ్డిపల్లి 86.37
అశ్వారావుపేట 83.69
మొత్తం 86.88

నియోజకవర్గం వ్యాప్తంగా గత ఎన్నికల పోలింగ్ శాతం:

ఎన్నికల సంవత్సరం
 పోలింగ్ శాతం
2009    81.77
2014      85.83
2018    83.65
2023   86.88