వరద బాధిత కుటుంబాలకు సాయం

– ప్రకటించిన కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ: ఉత్తరాదిన భారీ వరదలతో అతలాకుతలమైన ఢిల్లీ నగరం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటోంది. యుమునా నదివద్ద నీటి మట్టం స్థాయి కాస్త తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కీలక ప్రకటన చేశారు. యుమునా నది ఒడ్డున నివసించే చాలా పేద కుటుంబాలు ఈ వరదల కారణంగా నష్టపోవడంతో వారిని ఆదుకుంటామని తెలిపారు.కొన్ని కుటుంబాల్లో ఇంటి సామన్లు సైతం కొట్టుకుపోయాయి. వరద బాధిత కుటుంబాలన్నింటికీ రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఆధార్‌ కార్డు తదితర పత్రాలు కొట్టుకుపోయిన వారి కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామన్నారు.