సమస్యలతో సహవాసం

సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు జగన్‌
రాయపోల్‌లో ప్రజా పోరాట వేదిక సర్వే
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గ్రామాల్లో ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు పి.జగన్‌ అన్నారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో రాయపోల్‌లో ఇంటింటి సర్వే నిర్వహించారు. గ్రామంలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోల్కంపల్లికి వచ్చే రోడ్డులో పోలమోని అంజయ్య ఇంటి ముందు డ్రయినేజీ మ్యాన్‌ హౌల్‌ కప్పు పగిలిపోవడంతో ప్రమాదకరంగా మారిందన్నారు. వాహనదారులు నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారన్నారు. పలు సార్లు పంచాయతీ కార్యదర్శి చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్యతో పాటు వృద్ధాప్య, వితంతు పింఛన్లు అందడం తేదన్నారు. సీసీ రోడ్లు లేకపోవడంతో రోడ్లన్నీ అస్తవ్యస్థతంగా మారాయన్నారు. వృత్తిదారుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాకారం లభించటం లేదన్నారు. కార్యక్రమంలో సీసీఐ(ఎం) సీనియర్‌ నాయకులు బిక్షపతి, పల్లపు రవి తదితరులు పాల్గొన్నారు.