మైహోం సిమెంట్‌ పరిశ్రమ వద్ద

– కార్మికుల ఆందోళన
– మృతదేహాలను చూపించాలని డిమాండ్‌
నవ తెలంగాణ – మేళ్లచెరువు
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పరిధిలోని మైహౌం సిమెంట్స్‌లో ప్రమాద ఘటన వద్ద బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌ కార్మికులు బుధవారం పెద్దఎత్తున ఆందోళన చేశారు. మంగళవారం నాటి ప్రమాదంలో చనిపోయిన తమ వారి మృతదేహాలను చూపించాలని డిమాండ్‌ చేశారు. శిథిలాల కింద మరికొందరి మృతదేహాలు ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. దాంతో పరిశ్రమ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మోహరించారు. నిర్మాణ పనులు నిలిపివేసి ప్రమాద ఘటన శకలాలను తొలగించారు.