శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో..

– 1.559 కిలోల బంగారం పట్టివేత
నవతెలంగాణ-శంషాబాద్‌
విదేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విదేశాల నుంచి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్మగ్లర్స్‌ నుంచి రూ.93.28 లక్షల విలువ చేసే 1.559 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. దుబారు నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.12.59 లక్షల విలువైప 240 గ్రాముల బంగారం, మరో ప్రయాణికుడి నుంచి రూ.21.15 లక్షల విలువైన 348 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు, నాలుగో కేసులో రూ.29.10 లక్షలు, రూ.30.43 లక్షల విలువ చేసే 474.8 గ్రాములు, 496.6 గ్రాముల బంగారం పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.