ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి సిపిఆర్ సిస్టంపై అవగాహన 

నవతెలంగాణ కంఠేశ్వర్: రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పీఎస్ సిబ్బందికి సీపీఆర్ (సీపీఆర్ ఎలా నిర్వహించాలి అని) సిస్టమ్ గురించి అవగాహన కార్యక్రమం గురువారం నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి నారాయణ, ట్రాఫిక్ సిఐ చందర్రావు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బంది సిపిఆర్ పై తప్పనిసరిగా అవగాహన ఉండాలని నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తారని ట్రాఫిక్ ఏసిపి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ట్రాఫిక్ నారాయణ, ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్ తో పాటు, నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పాల్గొని ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు వాటిపై అవగాహన కల్పించుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు ట్రాఫిక్ పోలీస్ అధికారుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందనలు తెలిపారు.