తైక్వాండో ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా బాజిరెడ్డి జగన్ మోహన్

నవతెలంగాణ – డిచ్ పల్లి
హైదరాబాద్ లోని అభినంద్ గ్రాండ్ హోటల్ లో  తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అండ్ తైక్వాండో ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సాధారణ సర్వ సభ్య సమావేశం, రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నిజామాబాద్ జిల్లా తైక్వాండో అధ్యక్షులు, ఒలింపిక్ సంఘం నిజామాబాద్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్ మోహన్ ను ఒలింపిక్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, తైక్వాండో నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.మనోజ్ కుమార్ ఎన్నికయ్యారని తెలంగాణ తైక్వాండో రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సతీష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికలు టిఎఫ్ఐ అబ్జర్వర్ ఒలంపిక్ ఎస్ఎస్సి మల్లారెడ్డి ఆధ్వర్యంలో హైకోర్టు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరిగాయని వారు పేర్కొన్నారు.