బాల్క సుమన్ కు షాక్

నవతెలంగాణ-రామకృష్ణాపూర్:
పట్టణ బీఆర్ ఎస్ పార్టీకి,చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థికి బాల్క సుమన్ కు షాక్.పట్టణ బీఆర్ఎస్ కో అప్షన్ సభ్యులు ,సీనియర్ నాయకులు యాకుబ్ అలీ కాంగ్రెస్ పార్టీ లో గడ్డం వంశీ ఆధ్వర్యంలో చేరారు.ఈ సందర్భంగా యాకూబ్ అలీ మాట్లాడుతూ బాల్క సుమన్ నియంత పోకడలు, అహంకారానికి పార్టీని విడుతున్నానని,కాంగ్రెస్ పార్టీ వివేక్ గెలుపుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నంటి రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు,నాయకులు అబ్ధుల్ అజిజ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య,మహంకాళి శ్రీనివాస్,యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,కళ్యాణ్ ,మహేందర్ పాల్గొన్నారు.