బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీసీ గురుకులాల్లో ఆరు, ఏడు, ఎనిమిదో తరగతిలో ఖాళీల భర్తీ ప్రవేశ పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షకు 86.99 శాతం, ఏడో తరగతిలో ప్రవేశ పరీక్షకు 88.77 శాతం, ఎనిమిదో తరగతిలో ప్రవేశ పరీక్షకు 88.93 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 295 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 69,147 దరఖాస్తులొచ్చాయని, వారిలో 60,949 మంది హాజరయ్యారని తెలిపారు. ఆరో తరగతిలో 1,976 సీట్లు, ఏడో తరగతిలో 1,567 సీట్లు, ఎనిమిదో తరగతిలో 1,632 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.