లండన్‌లో కేటీఆర్‌కు ఘన స్వాగతం

నవతెలంగాణ – హైదరాబాద్‌
యూకే పర్యటనలో భాగంగా లండన్‌ చేరుకున్న మంత్రి కెేటీఆర్‌కు ప్రవాస భారతీయులు బుధవారం ఘనస్వాగతం పలికారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆయన యూకే పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈనెల 13 వరకు మంత్రి తన పర్యటనను కొనసాగిస్తారు. అందులో భాగంగా యూకేలోని పారిశ్రామిక దిగ్గజ సంస్థలతోపాటు వ్యాపార, వాణిజ్య సంఘాలతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరించనున్నారు.

Spread the love