బీసీ రక్షక్‌దళం వరద సహాయం

 BC Rescue Squad Flood Relief– ఎమ్మెల్యే సీతక్కకు అందజేత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ములుగు నియోజక వర్గ ప్రాంతం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే సీతక్క సహాయ, పునరావాస కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరదల్లో పుస్తకాలు కొట్టుకుపోయిన విద్యార్థులకు సహాయం చేయడం కోసం బీసీ యువసే రక్షక్‌ దళం సభ్యులు గురువారం ఎమ్మెల్యే సీతక్కను కలిసి లక్ష రూపాయల చెక్కును అందచేశారు. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులమై తమ వంతుగా ఈ సహాయం చేసినట్టు 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో బీసీి యువసేన జాతీయ సమన్వయకర్త పెచ్చటి మురళీ రామకృష్ణా రెడ్డి, రక్షక్‌ దళం సభ్యులు గుత్తుల రమణమూర్తి, గుబ్బల వెంకటరమణ, వాసంశెట్టి నాగార్జున, మద్దూరి రాజు, సాగ బాలకష్ణ తదితరులు పాల్గొన్నారు.