బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏకమై బహుజన రాజ్యం సాధించాలి

బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ గొల్ల సతీష్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు ఏకమై బహుజన రాజ్యం సాధించాలని, బహుజన రాజ్యంలోని అందరికి సమన్యాయం జరుగుతుందని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ గొల్ల సతీష్‌ అన్నారు. బుధవారం షాద్‌నగర్‌ పెన్షనర్స్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ జీతేగా బహుజన్‌ సమీక్ష సమావేశం నియోజవర్గ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ గొల్ల సతీష్‌ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలంతా ఐక్యమత్యంతో ముందుకు కొనసాగాలని, సుశిక్తులైన త్యాగంతో పాటు సమయాన్ని ఇచ్చిన నాయకులే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ, బహుజన సమాజాన్ని అధికారంలోకి తెస్తారన్నారు. మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, మాన్యశ్రీ కాన్షీరామ్‌ ఉద్యమ పోరాటాలను కార్యకర్తలకు వివరిస్తూ , కులం, మతం, వర్ణం, జాతి, లింగ బేధం లేని ఏకైక రాజకీయ పార్టీ బహుజన్‌ సమాజ్‌ పార్టీ అని తెలిపారు. మెజార్టీ ప్రజలను పాలకులను చేయడానికి బహుజన్‌ సమాజ్‌ పార్టీ దేశవ్యాప్త బహుజన ఉద్యమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. మాన్యశ్రీ కాన్షిరామ్‌ దేశవ్యాప్తంగా ఉన్న బహుజనులకు విముక్తి ఉద్యమాన్ని అందించారన్నారు. మోసపూరిత దోపిడీ పార్టీలైన బీఆర్‌ఎస్‌, బిజెపి , కాంగ్రెస్‌ పార్టీలు పథకాల పేరుతో బహుజనులకు ఆశలు చూపుతూ వారి జీవితాలను అంధకారంలోకి నెట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బహుజన ప్రజలకు విముక్తి జరగాలంటే బిఎస్పీ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుండెల ధర్మేందర్‌, విజరు ఆర్య, జిల్లా ఇన్‌చార్జులు గ్యార జగన్‌, గన్నోజు మహేష్‌ చారి, జిల్లా అధ్యక్షులు పి లింగం, జిల్లా కోశాధికారి మణుగూరు రాంప్రసాద్‌ గౌడ్‌, జిల్లా కార్యదర్శులు తట్టేపల్లి రాములు, గుండేటి నర్సింలు, అసెంబ్లీ ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్‌ ముదిరాజ్‌, కోశాధికారి గోపని భీమయ్య, అసెంబ్లీ మహిళా కన్వీనర్‌ సుగుణ ముదిరాజ్‌, దానిని ఇంద్రసేన, మైసగల అనంతయ్య, దోమ హరికుమార్‌, తుప్పరి కుమార్‌ స్వేరో, గాదపాక మోజస్‌, కే.మహేందర్‌, పోమాల మల్లేష్‌ , రాజేష్‌ చౌహాన్‌, పులిమామిడి నాగేష్‌ , ముక్కిడి ఉదరు కష్ణ, బానూరు చంద్రయ్య, పొట్ట నర్సింగరావు, గాదెపాగా ఆశీర్వాదం, అబి జగన్‌ , ఎర్రోళ్ల జగన్‌, సొంటె శ్రీనివాస్‌, నీరటి రాజు, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.