కేంద్రంలో అధికారంలో ఉండి చర్యలెందుకు తీసుకోలేదు?

– బండి సంజయ్ కు కోదండరెడ్డి సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉండి చర్యలెందుకు తీసుకోలేదని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.కోదండరెడ్డి ప్రశ్నించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ టికెట్లను కేసీఆర్‌ నిర్ణయిస్తారంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించడం దుర్మార్గమంటూ విమర్శించారు. పంట నష్టపోతే… ఆదుకునే బాధ్యత కేంద్రానికి లేదా..? . భువనగిరిలో రైతులకు బేడీలు వేసినప్పుడు….బీజేపీ ఏం చేసింది ? అక్కడ రైతుల భూములు లాక్కుంటుంటే ఏం చేశారు..? అంటూ ప్రశ్నించారు.