పట్టణ ప్రాంతాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు

– ప్రథమ చికిత్సే ఆర్‌ఎంపీల లక్ష్యం
– డాక్టర్‌ ఎండీ జాఫర్కు డాక్టరేట్‌
– ప్రాణ రక్షకుడిగా వైద్య సేవలు
– గ్రేటర్‌ ఆర్‌ఎంపీల సంఘం ఎండి జాఫర్‌
నవతెలంగాణ-గండిపేట్‌
పట్టణ ప్రాంతాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడం తమ లక్ష్యమని గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ టీఎస్‌, పి.ఎం.పి, ఆర్‌.ఎం.పి లా అధ్యక్షులు డాక్టర్‌ ఎండి జాఫర్‌ మియా అన్నారు. సోమవారం పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మెరుగైన ఉచిత వైద్య శిబిరాలను అందించినందుకు మ్యాజిక్‌ ఆర్‌ ఆర్‌ టి ఢిల్లీ యూనివర్సిటీ వారు డాక్టరేట్‌ సర్టిఫికెట్‌ అందజేశారు. ఈ సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్‌ఎంపీ డాక్టర్ల అసోసియేషన్‌ తరపున వారు మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల కోసం ఉచితంగా వైద్య సేవలను అందిస్తూ ప్రాణ రక్షకుడిగా నిలిచినందుకు తమకు అవార్డు వరించిందన్నారు. గత 32 సంవత్సరాల పాటు పట్టణ ప్రాంతాల్లో వలస కార్మిక కూలీలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో బస్తీలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యం అన్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం తక్కువ ఖర్చుతో ప్రధమ చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. సేవా దృక్పథంతో రోగి ప్రాణాలను కాపాడేందుకు నిత్యం కృషి చేస్తున్నట్టు తెలిపారు. మానవసేవే మాధవసేవన కోణంలో ప్రజలకు ప్రాణ బిక్ష పెట్టడం గొప్ప వారం అన్నారు. వైద్యుడు సేవలు భగవంతునితో సమానంగా ఆరాధిస్తున్నట్టు తెలిపారు. వైద్య రంగాన్ని వ్యాపారంతో కాకుండా పేదలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. తమను ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి డాక్టరేట్‌ సర్టిఫికెట్‌ అందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆర్‌ఎంపీల రాష్ట్ర అసోసియేషన్‌ జిల్లా అసోసియేషన్‌ తరపున తమను అభినందించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు డాక్టర్‌ వెంకటరెడ్డి, ఆర్‌ఎంపీల డాక్టర్లు వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.