చెరువులు, కుంటలు, వాగులతో జాగ్రత్త వర్షాల పట్ల ప్రజలు

– అప్రమత్తంగా ఉండాలి
– ఉధృతంగా ఉంటే వాగులు దాటొద్దు
తాండూరు రూరల్‌ సీఐ రాంబాబు
నవతెలంగాణ-తాండూరు రూరల్‌
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురు స్తున్న భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న వాగులు, చెరువులు, వంకల వద్దకు వెళ్లే ప్రయత్నం ఎవ్వ రు చేయొద్దని తాండూరు రూరల్‌ సీఐ రాం బాబు సూచించారు. ఆదివారం ఆయన మాట్లా డుతూ సంగెంకలాన్‌లో వాగుదాటే ప్రయత్నం చేసి గల్లంతైన పెంటప్ప మృతి సంఘటన బాధాకరం అన్నారు. ఇలాంటి సంఘటనలు మరోమారు జరగకుండా చూడాలన్నారు. ప్ర స్తుతం భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో తాం డూర్‌ నియోజకవర్గంలోని యాలాల, బషీరా బాద్‌, తాండూర్‌ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించే ప్రజలు సురక్షిత నివాసాలకు తరలివెళ్లాలని అన్నారు. గ్రామాల సమీపంలోని చెరువులు, వాగుల వద్దకు వెళ్లరాదని, పిల్లలు, యువకులు వెళ్లకుండా దృష్టి సారించాలన్నారు. ప్రవహిస్తున్న వాగులను దాటే సాహసాలను చేయొద్దన్నారు. అదేవిధంగా విద్యుత్‌ స్థంబాల వద్దకు వెళ్లరాదని, ఇంట్లో ఎలక్ట్రిక్‌ వస్తువుల నుంచి విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా చూడా లన్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఇ బ్బందులు ఉంటే పోలీసులకు సంప్రదించాల న్నారు. అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడితే పోలీసులను సంప్రదించాలని సూచించారు.