నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అద్వర్యంలో ఖమ్మం, సర్దర్ పటెల్ స్టేడియంలో ఈ నెల 25, 26వ తేదీలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సినియర్ అథ్లెటిక్స్ చంపియన్షిప్‌లో భద్రాద్రి జిల్లా అథ్లెట్లు 10 మంది పాల్గొని 5 పతకాలు గేలుపొందారని ఇందులో 1 బంగారు పతకము, 4 కాంశ్య పతకాలు గెలుపొందారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి కె.మహిధర్ తెలిపారు. భద్రాచలంకు చెందిన వర్స రాజు, 800 మీటర్ల పరుగుపందంలో బంగారు పతకం, కొత్తగుడెంకు చెందిన వి.వంశీ కృష్ణ 400 మీటర్లు, 200 మీటర్లు పరుగుపందంలో రెండు కాంశ్య పతకాలు, మణుగూరుకు చెందిన పి.నవ్య లాంగ్ జంపులో కాంశ్య పతకం, దమ్మపేటకు చెందిన జి.జరు రాకేశ్ లాంగ్ జంపులో కాంశ్య పతకం సాధించారని తెలిపారు. ఈ సందర్బముగా క్రీడాకారులను, కోచ్‌లు పి.నాగేందర్, కృష్ణలను రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.సారంగపాణి, భద్రాద్రి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ జివికే.మనోహర రావు, అద్యక్ష్యులు గొట్టపు రాధాకృష్ణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి రాజేందర్ ప్రసాద్‌లు అభినందించారు.