నిజామాబాద్ నగరం లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన బిగాల

నవతెలంగాణ -కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  గణేష్ బిగాల నిజామాబాద్ నగరం లో 5 కోట్ల 97 లక్షల రూ.లతో పలు అభివృద్ధి పనులని బుధవారం ప్రారంభించారు.
అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే గణేష్ బిగాలకి మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.ఇందిర పూర్ నుండి భారతి రాణి కాలనీ వరకు  బి ఆర్ ఎస్ యువజన విభాగం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.41వ డివిజన్ లోఇందిర ప్రియ దర్శిని కాలనీ లో 16 లక్షల రూ.లతో నిర్మించిన పార్క్ ని ప్రారంభించారు.8వ డివిజన్ సీతారాం కాలనీ లో 1 కోటి రూ. లతో నిర్మిస్తున్న సి.సి.రోడ్డు,సి.సి డ్రైన్స్, కల్వర్టు ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.9వ డివిజన్ ఇందిర పూర్ కాలనీ లో 1 కోటి రూ.లతో నిర్మిస్తున్న సి.సి.రోడ్డు,సి.సి డ్రైన్స్, కల్వర్టు ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.10వ డివిజన్ గోశాల రోడ్డు లో 1 కోటి రూ.లతో నిర్మిస్తున్న సి.సి.రోడ్డు, సి.సి డ్రైన్స్, కల్వర్టు ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.11వ డివిజన్ భారతి రాణి కాలనీ లో 2 కోట్ల రూ.లతో నిర్మిస్తున్న సి.సి.రోడ్డు,సి.సి డ్రైన్స్ మరియు కల్వర్టు ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.13వ డివిజన్ లో 81.40 లక్షల రూ.లతో చేపడుతున్న స్మశాన వాటిక అభివృద్ధి పనులను ప్రారంభించారు.13వ డివిజన్ లో 1 కోటి రూ.లతో నిర్మిస్తున్న సి.సి.రోడ్డు,సి.సి డ్రైన్స్ మరియు కల్వర్టు ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్  దండు నీతు కిరణ్ ,అదనపు కలెక్టర్ కూ.చిత్ర మిశ్రా ,మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ ,డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్ బి ఆర్ ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్,సత్య ప్రకాష్,సూదం రవి ఛాందర్,41 డివిజన్ కార్పొరేటర్ ఇందిర వినోద్,బి.ఆర్.ఎస్ ఎస్టి సెల్ అధ్యక్షురాలు  చాంగు భాయి, టిఆర్ఎస్కెవి నాయకులు విజయ లక్ష్మి,షేక్ అహ్మద్,8వ డివిజన్ కార్పొరేటర్ విక్రమ్ గౌడ్,,నుడ డైరెక్టర్ అంబాదాస్,నాయకులు నరేందర్ గౌడ్,మధు సుధన్,9వ డివిజన్ కార్పొరేటర్ సాధు సాయి వర్ధన్, నాయకులు దండు శేఖర్,,బంగారు నవనీత, సాయిలు,,సుధాకర్,10వ డివిజన్ కార్పొరేటర్ బొడిగం కోమల్, నాయకులు బొడిగం నరేష్,,దీల్లోడ్ ఆకాష్,11వ డివిజన్ నాయకులు పవర్ పండరీ,నరేష్ 13వ డివిజన్ కార్పొరేటర్ హారూన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.