పోస్ట్‌ ఆఫీసుల్లో జాతీయ జెండాలను తీసుకోవాలని బైక్‌ ర్యాలీ

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఆజాదికా అమృత మహాత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని రాంచంధ్రాపురం పోస్టల్‌ ఇన్స్‌పెక్టర్‌ సావిత్రి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. భేల్‌ క్యాం పస్‌లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రతీ పోస్ట్‌ ఆఫీస్‌లో జాతీయ జెండాలను విక్రహిస్తున్నామని తెలిపారు. ఒక్కొ జెండా రూ.25లకు విక్రయిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. జెండా వందనం 15న ప్రతి ఇంటిలోనూ, ఆఫీసుల్లోనూ తను జాతీ య జెండాను ఎగురవేసి, జాతీయ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవాలని తెలిపారు. పోస్ట్‌ ఆఫీస్‌ వరకు రాలేని వారు షషష. వజూశీర్‌శీటళషవ. స్త్రa.ఱఅలో ఆర్డర్‌ చేస్తే ఇంటి వద్దకే తమ సిబ్బంది వ చ్చి అందిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు దగ్గర లోని పోస్ట్‌ ఆఫీస్‌ను సంప్రదించగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డివిజన్‌ సూపరింటెండెట్‌ మురళికుమార్‌, పోస్ట్‌ మాస్టర్‌ ఆంజనేయులు, పోస్ట్‌మెన్‌లు తదితరులు పాల్గొన్నారు.