
స్థానిక మారుతినగర్లోని స్నేహ సొసైటి ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ మానసిక వికలాంగుల పాఠశాల నందు ఎన్ఆర్ఐ నోముల రాంచందర్ రెడ్డి 79 వ జన్మదిన
వేడుకలను గురువారం స్నేహ సొసైటీ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమున్ని ఉద్దేశించి స్నేహసోసైటీ కార్యదర్శియస్. సిద్దయ్య మాట్లాడుతూ.. నోముల రాంచందర్ రెడ్డి నిజామబాద్ జిల్లా వాసి ఆయన అమెరికాలో స్థిరపడి జిల్లా అభివృద్ధికోసం రామనాములు చారీ డెబుల్ ట్రస్టు ఏర్పాటుచేసి, జిల్లులో పలు కార్యక్రములు నిర్వహిస్తున్నారు. అనాధ విద్యార్థులకు పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను భోదిస్తున్నారు. మహిళలకు వృతి శిక్షణను ఇచ్చి జీవనోపాది ఇస్తున్నారు. వృద్ధాశ్రములకు ఇతిధికంగా సహాయాన్ని అందిస్తున్నారు అని అన్నారు. ఆయన 79 వ జన్మదినాన్ని పురస్కరించుకొని స్నేహం చారిటి కంటి ఆసుపత్రికి ఒక లక్ష రూపాయలను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమములో రామనాముల చారిటబుల్ ట్రస్టు కార్యదరి వాసు గౌడ్ పాల్గోని లక్ష రూపాయల చెక్కును అందించారు. అదే విధంగా స్నేహసోసైటీ ప్రిన్సిపాల్ యస్. జ్యోతి, సురేందర్ గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, మానసిక వికలాంగుల విద్యార్థులు, అంధవిద్యార్థులు, పాఠశాలల సిబ్బంది పాల్గన్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.