ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా: ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి

ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా: ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి– బంగారు తెలంగాణగా మారుస్తానని అప్పులకుప్పగా మార్చిన ఘనత కేసిఆర్‌ది: ఉద్యమ నేత విఠల్‌ రావు
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మామి డాల యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో గుడికుంట తండా, మంచప్పల, చెన్నూరు గ్రామాల్లో గడపగడపకు కాం గ్రెస్‌-పల్లెపల్లెకు ఝాన్సమ్మ ప్రచార కార్యక్ర మంలో భాగంగా యశస్వినిరెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు, కార్యకర్తలు బతుకమ్మలతో, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్‌ జర్నలిస్ట్‌ విఠల్‌రావు యశస్వినిరెడ్డితో కలిసి మాటా ్లడారు. అమరవీరుల త్యాగాల మీద ఏర్పడిన తెలం గాణ రాష్ట్రం కేవలం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మారుస్తానని చెప్పి, అప్పుల కుప్పగా మార్చిన ఘనత కెసిఆర్‌కు దక్కిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక అర్హులందరికీ ఆరుగ్యారెంటీ కార్డులు అమలుచేసి మాట నిలబెట్టుకుంటామన్నారు. నిన్న సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ గిరిజనులకు గిరిజన బంధు ఇస్తానని, మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ దళితబంధు ఇస్తానని చెప్పి దళితులను మోసం చేశారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినాయకులు ఈఅసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకు గిరిజనబంధు పేరుతో మరోసారి గిరిజనులను మోసం చేయాలని చూస్తు న్నాన్నారు. గిరిజన సోదరులకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్‌ అని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే ముందు గిరిజన సోదరులు, ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని తొమ్మిది సంవత్సరాలు బిఆర్‌ ఎస్‌ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి రాబోయే 15 రోజులు నాకోసం కష్టపడండి, తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఐదు సంవత్సరాలు ఈనియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని, తనకు వచ్చే వేతనాన్ని కూడా పాలకుర్తి నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానని యశస్వినీరెడ్డి తెలిపారు. ప్రతి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త ఒక సైని కుల్లాగా పని చేయాలని కోరారు. ఈప్రచార కార్యక్ర మంలో మండల పార్టీ అధ్యక్షుడు గిరగాని కుమార స్వామి, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మాదాస్‌ హరీష్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ కారుపోతుల శ్రీనివాస్‌ గౌడ్‌, పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాలొ న్నారు.