అత్యవసర సాయం అందించండి

– ఎట్టకేలకు తీర్మానాన్ని ఆమోదించిన భద్రతామండలి
ఐక్యరాజ్య సమితి : గత నెల రోజులకు పైగా సాగుతున్న ఇజ్రాయిల్‌ యుద్ధంపై తీర్మానాన్ని ఆమోదించడంలో నెలకొన్న ప్రతిష్టంభనను ఎట్టకేలకు భద్రతా మండలి అధిగమించగలిగింది. ఎలాంటి ఆటంకం లేకుండా అత్యవసరమైన మానవతా సాయాన్ని బాధితులకు అందించేందుకు వీలుగా గాజాలో మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేయాలని పిలుపిస్తూ భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. గాజాలోని బాధితులకు ఆహారం, మందులు, ఇతర సామగ్రిని అందజేసేందుకు వీలుగా ఆటంకాలు తొలగించి, మార్గాలను తెరవాలని కోరుతూ ఐరాస భద్రతా మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పదిహేను మంది సభ్యులుండే భద్రతా మండలిలో 12 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా అమెరికా, బ్రిటన్‌, రష్యా గైర్హాజరు అయ్యాయి. హమస్‌ జరిపిన దాడులను ఖండించడంలో తీర్మానం విఫలమైందని ఆరోపిస్తూ అమెరికా, బ్రిటన్‌ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. మానవత్వంతో కాల్పుల విరమణ పాటించాలని తీర్మానం కోరనందుకు నిరసనగా రష్యా ఓటింగ్‌కు గైర్హాజరు అయింది. తీర్మానంలో సవరణ చేసేందుకు ఓటింగుకు ముందు రష్యా చేసిన ప్రయత్నం ఫలించలేదు. బందీలుగా ఉంచిన వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని తీర్మానం కోరింది. యూరప్‌ దేశమైన మాల్టా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ‘మేము ఈ రోజు సాధించింది ముఖ్యమైన తొలి చర్య’ అని ఐరాసలో మాల్టా రాయబారి ఫ్రాజియర్‌ వ్యాఖ్యానించారు. కాగా ఈ యుద్ధంలో అనేక అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘనకు గురవుతున్నాయని, దీనిపై దర్యాప్తు జరిపించాలని ఐరాస మానవ హక్కుల అధిపతి వాల్కర్‌ టర్క్‌ కోరారు.
బుల్డోజర్లతో ఆస్పత్రి ఎంట్రన్స్‌ ధ్వంసం
గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి షిఫా దక్షిణ ప్రాంత ప్రవేశ ద్వారాన్ని ఇజ్రాయిల్‌ దళాలు బుల్‌డోజర్లతో ధ్వంసం చేశాయని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. నలభై రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయిల్‌ దళాలు ప్రధానంగా ఈ ఆస్పత్రినే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి. ఈ దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. షిఫా ఆస్పత్రిలో చేపట్టిన గాలింపు చర్యల్ని కొనసాగిస్తామని గాజాలో ఇజ్రాయిల్‌ సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న దళాల అధిపతి మేజర్‌ జనరల్‌ యారన్‌ ఫింకెల్‌మాన్‌ చెప్పారు.
హృదయవిదారక దృశ్యాలు
ఇజ్రాయిల్‌ దళాలు బుధవారం ఈ ఆస్పత్రిలో ప్రవేశించడానికి ముందు లోపల 2,300 మంది రోగులు, సిబ్బంది, నిరాశ్రయులైన పౌరులు ఉన్నారని ఐరాస సంస్థలు అంచనా వేశాయి. ముసుగులు ధరించిన కొందరు ఇజ్రాయిల్‌ సైనికులు గాలిలోకి కాల్పులు జరిపారని, లొంగిపోవాల్సిందిగా యువతను ఆదేశించారని లోపల చిక్కుకుపోయిన ఓ పాత్రికేయుడు తెలిపారు. ఇజ్రాయిల్‌ సైనికులు కొందరు పాలస్తీనియన్లను నగంగా నిలబెట్టి ఆయుధాలు, పేలుడు పదార్థాల కోసం తనిఖీలు చేశారని ఆయన చెప్పారు. ఆస్పత్రి లోపల పరిస్థితి హృదయవిదారకంగా ఉన్నదని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. మత్తమందు ఇవ్వకుండానే శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఆహారం, నీరు లభించక రోగుల బంధువులు కారిడార్లలో ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా వుండగా హమాస్‌ను పూర్తిగా నాశనం చేసే వరకూ ఇజ్రాయిల్‌ యుద్ధం ఆగదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు.

Spread the love
Latest updates news (2024-05-21 03:30):

blood sugar after p4t eating banana | why does my blood sugar drop after PSu i eat | cortisol and Ymi blood sugar | blood sugar cXm sex magik full album youtube | low blood sugar puppy ese | YJ8 lowering blood sugar prediabetes | does b12 help ttt lower blood sugar | G1x does insoluble fiber lower blood sugar | intermittent fasting blood mL6 sugar low | low price blood sugar regulator | 9Ds what organ measures blood sugar | blood sugar within an hour of eating KOd | ways Vmp to lower morning blood sugar | foods to DPT lower blood sugar naturally | what is a cat normal blood O6f sugar level | YV0 does hemp oil affect blood sugar | can acidity increase B06 blood sugar | blank FCv chart with blood pressure pulse and blood sugar | weight loss lower blood sugar jz9 levels | does candy BK6 help with low blood sugar | keto net carbs blood sugar Gxf | blood sex sugar magik FbM bass pdf | kkE does jardiance cause low blood sugar | Heb can curcumin help blood sugar | having low blood fiH sugar and anorexia | can vonstant high blood sugar cause high wbc ROA count | is Ah2 blood sugar 112 good | blood sugar hunger genuine | what is f4R the normal number for your blood sugar | 263 blood sugar after eating PSJ | weight loss blood sugar DWO monitor | what is a HEb good blood sugar after you eat | will a P8m cortisone shot raise blood sugar | allergies and FOh sinus infection affect blood sugar | does vodka make your 1QO blood sugar go up | blood sugar level of 350 dangerous nn0 | how to perform fasting blood B4h sugar | hypoglycemia chart blood 1BB sugar | how much water WQv should i drink to lower blood sugar | can panic raise blood gdt sugar | what time of vor day is blood sugar lowest | foods to help raise your blood R7F sugar | what causes raised blood sugar when you Epg are sick | PoQ best exercise for high blood sugar | does oOo lifting weights reduce blood sugar | treatment of high blood Ye4 sugar levels | Vtu low blood sugar after bypass surgery | walgreens blood sugar test free mPg | will boiled eggs raise my 363 blood sugar | effect of high blood VAQ sugar on body